- పురుగుల మందు డబ్బాతో తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఓ కుటుంబం నిరసన
కామేపల్లి, వెలుగు : ఫేక్ వీలునామాతో తమ భూమిని కాజేయాలని చూస్తున్నారని, తమకు న్యాయం చేయకపోతే చనిపోతామని ఓ కుటుంబం పురుగుల మందు డబ్బాతో తహసీల్దార్ ఆఫీస్ ఎదుట శనివారం నిరసన తెలిపింది. మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన దీవ్వెల రామనర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. తన తండ్రి పేరు మీద 10 ఎకరాల భూమి ఉందని, దానిని కాజేయడానికి ముగ్గురు వ్యక్తులు ఫేక్ వీలునామా సృష్టించి రెవెన్యూ అధికారులను తప్పు దోవపట్టిస్తున్నారని తెలిపారు. తమ భూమిని తహసీల్దార్ కాపాడి న్యాయం చేయాలని కోరారు. లేకపోతే తాము ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమన్నారు. దీనిపై తహసీల్దార్ సుధాకర్ ను వివరణ కోరగా వీలునామా ప్రకారం వ్యవహరిస్తామని తెలిపారు.